అనాథ ఆశ్రమానికి ఆర్జేడీ చేయూత

Tue,January 10, 2017 02:43 AM

రాంమందిర్ ఏరియా : స్థానిక గాంధీనగర్‌లో ఎండీహెచ్‌డబ్ల్యూఎస్ అనాథ పిల్లల ఆశ్రమానికి వరంగల్ ఆర్జేడీ ఎల్. సుహాసిని చేయూతనందించారు. ఈ మేరకు సో మవారం ఆశ్రమాన్ని సం దర్శించిన ఆమె రూ.2,500 విలువైన వాటర్ ట్యాంక్‌ను ఆశ్రమానికి విరాళంగా అందజేశారు. అనాథ పిల్లలను ఆదుకునేందుకు ప్రతి ఒక్క రూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహర్షి డిగ్రీ కళాశాల సిబ్బంది, విద్యార్థులు, ఆశ్రమ వ్యవస్థాపకులు పోచంపల్లి రాజయ్య, భూలక్ష్మి, ప్రసాద్, ప్రశాంత్ పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...