దరఖాస్తుల ఆహ్వానం


Tue,January 10, 2017 02:43 AM

అంతర్గాం : మండలం లింగాపూర్ మోడల్ స్కూల్‌లో 2017-18 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సారా తస్లీమ్ సోమవారం తెలిపారు. 6 నుంచి 10వ తరగతి వరకు ప్రకటన దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. 6వ తరగతిలో వంద సీట్లు, 7 నుంచి 10వ తరగతి వరకు ఖాళీలను తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు జనవరి 16 నుంచి 31 వరకు పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్ www.telanganams.cgg.gov.inలో ఆన్‌లైన్ దరఖాస్తులను పూరించి, ప్రింటెడ్ పత్రాలను పాఠశాలలో అందజేయాలని సూచించారు. హాల్ టికెట్లు ఫిబ్రవరి 2 నుంచి 26 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. 26న ఉదయం 10 గంటల నుంచి 12 వరకు పరీక్ష కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రవేశాలు పొందిన విద్యార్థుల తుది జాబితాను మార్చి 10న వెల్లడిస్తారని తెలిపారు. 17, 18 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS