సాఫీగా ప్రయాణం..


Wed,November 13, 2019 02:11 AM

నిజామాబాద్‌ సిటీ : నిజామాబాద్‌ ఆర్టీసీ రీజియన్‌ పరిధిలో బస్సులు యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రయాణికులు క్షేమంగా గమ్యస్థానాలకు చేరకుంటున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్నది. కలెక్టరేట్‌ ఎదుట కార్మికులు తమ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు దీక్షలో పాల్గొని మద్దతు తెలుపుతున్నారు. 39 రోజు మంగళవారం ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సీపీఎం, ప్రజాంఘాల ఆధ్వర్యంలో దీక్షలో కూర్చున్నారు. మంగళవారం నిజామాబాద్‌, కామారెడ్డి ఉభయ జిల్లాల్లో 446 బస్సులు నడిచాయి. ఇందులో నిజామాబాద్‌ జిల్లాలో 263 బస్సులు ఉన్నాయి. ఆర్మూర్‌ డిపో పరిధిలో 54 బస్సులు, బోధన్‌ డిపో పరిధిలో 71 బస్సులు, నిజామాబాద్‌ డిపో -1 నుంచి 74 బస్సులు. డిపో-2 పరిధిలో 64 బస్సులు నడిచాయి. కామారెడ్డి జిల్లాలో 183 బస్సులు నడిచాయి. ఇందులో బాన్సువాడ డిపో పరిధిలో 77 బస్సులు, కామారెడ్డి డిపో పరిధిలో 106 బస్సులు నడిచినట్లు నిజామాబాద్‌ ఆర్‌ఎం సాల్మన్‌ తెలిపారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...