ఆటో బోల్తా.. పలువురికి గాయాలు


Mon,November 11, 2019 12:58 AM

శక్కర్‌నగర్: బోధన్ మండలం నాగన్‌పల్లి శివారులో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఆదివారం రాత్రి ఓ ఆటో ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడింది. బోధన్ నుంచి సాలూర వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో రోడ్డు పక్కన చీకట్లో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. ఆటో పల్టీకొట్టగా సాలూరాకు చెందిన బీరెడ్డి ఇన్నారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న పెద్దపుడి విజయలక్ష్మి, పులి రాజమణి, వన్నెల అంజలి బాయిలకు తీవ్ర గాయలయ్యాయి. బోధన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బోధన్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. రోడ్డు పక్కన చీకట్లో ట్రాక్టర్ నిలిపి ఉంచిన యజమానిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ పల్లె రాకేశ్ తెలిపారు.
ఘనంగా జైన చతుర్మాస ముగింపు వేడుకలు

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...