జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీల్లో పాల్గొనడం అభినందనీయం


Mon,November 11, 2019 12:58 AM

నిజామాబాద్ సిటీ: సైకిలిస్టులు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం అభినందనీయమని, జాతీయ స్థాయిలో పతకాలు సాధించి జిల్లా, రాష్ర్టానికి పేరు తేవాలని ఆర్డీ వో సీహెచ్ వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం నిజామాబాద్ సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ముగ్గురు క్రీడాకారులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్‌లో జరగనున్న 24వ జాతీయ రోడ్ సైక్లింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు జిల్లాకు చెందిన ముగ్గురు సైక్లిలిస్టులు ఎంపికయ్యారు. గత నెల లో మెదక్ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీల్లో పతకాలు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచారు. అనంతరం జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన యశ్వంత్ కు మార్, శ్రీముఖి, మేధారెడ్డిని పూలమాల, శాలువతో సన్మానించారు. సైక్లింగ్ సంఘం ఉపాధ్యక్షుడు రాజ్‌కుమార్ సుబేదార్, సూర్యప్రకాశ్, గంగాధర్, భూలోకం విజయ్‌కాంత్‌రావు, రాకేశ్‌కుమార్ పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...