నేడు గిరిజన గురుకుల పాఠశాల ప్రారంభం


Mon,November 11, 2019 12:57 AM

నస్రుల్లాబాద్ : మండల కేంద్రలో రూ. 4.20 కోట్లతో నిర్మించిన గిరిజన గురుకుల బాలుర పాఠశాలను గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. భవనాన్ని, గదులను రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ఆదివారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. భవన నిర్మాణ నాణ్యత, సకాలంలో పూర్తిచేయడంపై స్పీకర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు. సోమవారం నుంచే నూతన భవనంలో విద్యా బోధన, వసతి సౌకర్యాలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు రామకృష్ణ, వెంకన్న, బాన్సువాడ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి పోచారం సురేందర్ రెడ్డి, జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మాజిద్, ఏఎంసీ మాజీ చైర్మన్ పెర్క శ్రీనివాస్, వైస్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, కాంట్రాక్టర్ వెంకటేశ్వర్ రావు, నాయకులు ప్రతాప్, లక్ష్మీనారాయణ గౌడ్, సాయిలు, సక్రు ,ఫకీరా తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...