ఏవోను బెదిరించిన విలేకరులపై పోలీసులకు ఫిర్యాదు


Sun,November 10, 2019 01:45 AM

లింగంపేట: మండల వ్యవసాయ అధికారిని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఇద్దరు విలేకరులపై లింగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు, రైతులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎల్లారెడ్డికి చెందిన పృథ్వీరాజ్ (ఐన్యూస్ ), సతీశ్ (అదిమూలం ) మండల వ్యవసాయ శాఖ అధికారి సాయిరమేశ్‌గౌడ్ వద్దకు వచ్చి డబ్బులు డిమాండ్ చేశారన్నారు. రైతుల కోరిక మేరకు టార్ఫాలిన్ కాగితాలు మార్కెట్ ధర కంటే తక్కువకు అందిస్తున్న వ్యవసాయ శాఖ అధికారి సాయి రమేశ్‌ను డబ్బులు డిమాండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

డబ్బులు ఇవ్వకపోవడంతో తప్పుడు వార్తలు ప్రచురించినట్లు పేర్కొన్నారు. డబ్బులు డిమాండ్ చేసిన విలేకరులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఇద్దరు విలేకరులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వీరిద్దరు గతంలోనూ డబ్బుల వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపించారు. ఈవిషయమై ఎస్సై సుఖేందర్‌రెడ్డిని వివరణ కోరగా విలేకరులపై ఫిర్యాదు వచ్చిందన్నారు. విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో సర్పంచులు బండి రాజయ్య, పరశురాం, ఆకుల లక్ష్మీనారాయణ, సింగిల్ విండో డైరెక్టర్ నయీం, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, గాండ్ల నర్సింహులు, రమేశ్‌గౌడ్, కమ్మరి దత్తు, పీర్‌సింగ్, బండి నర్సింహులు, కొండా లక్ష్మణ్, సాయాగౌడ్, రైతులు పెద్దోళ్ల పోశయ్య, రాములు, గంగారాం, రామలింగం, సేవ్యానాయక్ ఉన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...