రోడ్డు ప్రమాదాల్లో పలువురికి గాయాలు


Sun,November 10, 2019 01:45 AM

కామారెడ్డిరూరల్ : మండలంలోని గర్గుల్ గ్రామ శివారులో శనివారం డీసీఎం ఆటోను ఢీ కొట్టడంతో పలువురికి గాయాలయ్యాయి. దేవునిపల్లి ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డిపేట్ గ్రామానికి చెందిన ప్యాసింజర్ ఆటో ప్రయాణికులతో కామారెడ్డి నుంచి రెడ్డిపేట్ గ్రామం వెళ్తున్నది. అడ్లూర్ శివారులోని సబ్‌స్టేషన్ సమీపంలో ఆటోను వెనకాల నుంచి వస్తున్న డీసీఎం ఓవర్‌టెక్ చేయబోయి ఢీకొట్టడంతో ఆటో ఒక్కసారిగా రోడ్డు కిందకు వెళ్లిపొయింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న రెడ్డిపేట్ గ్రామానికి చెందిన ఆరుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. డీసీఎం డ్రైవర్ పరారిలో ఉన్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

న్యావనందిలో యువకుడికి..
సిరికొండ: మండలలోని న్యావనంది గ్రామానికి చెందిన గాండ్ల సతీశ్ ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సతీశ్ న్యావనంది నుంచి చిన్నవాల్గోట్‌కు బైక్‌పై వెళ్తుండగా మార్గమధ్యలో సిరికొండ మాడల్ స్కూల్ సమీపంలో ఆగిఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని కింద పడ్డాడు. దీంతో తలకు బలమైన గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు ప్రైవేటు వాహనంలో జిల్లా కేంద్రంలోని దవాఖానకు తరలించారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...