కోటగిరి : గర్భిణులు, బాలింతల ఆరోగ్య సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జల్లాపల్లిఫారం సర్పంచ్ అమీనాబేగం అన్నారు. శనివారం మండలంలోని జల్లాపల్లిఫారం గ్రామ పంచాయతీ ఆవరణలో గర్భిణులు, బాలింతలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అమీనాబీ మాట్లాడుతూ.. గర్భిణులు ప్రతి రోజూ అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. రక్తహీనతపై అవగాహన కల్పించారు. పొతంగల్ పీహెచ్సీ సూపర్వైజర్ కృష్ణవేణి మాట్లాడుతూ.. మూడు నెలల్లోపున్న గర్భిణులు స్థానిక అంగన్వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని, కేసీఆర్ కిట్‌కు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు రజీయా బేగం, ఫర్వీన్, ఆరోగ్య సూపర్వైజర్ సాయికుమారి, ఏఎన్ఎం సవిత, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.