సేంద్రియ పద్ధతిలో పంటల సాగు శ్రేయస్కరం


Fri,November 8, 2019 03:49 AM

నిజామాబాద్ రూరల్: ప్రతి రైతూ సేంద్రియ పద్ధతిలో పంటలను సాగు చేస్తే శ్రేయస్కరంగా ఉంటుందని జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. గురువారం గూపన్‌పల్లి గ్రామశివారులో ఆదర్శ రైతు చిన్నికృష్ణుడు 60 రకాల వరి వంగడాలతో సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన వరి పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో రకాల వరి వంగడాలతో వినూత్న పద్ధతిలో పంట సాగు చేసి రైతులందరికీ చిన్నికృష్ణుడు ఆదర్శంగా నిలువటం అభినందనీయమని పేర్కొన్నారు. రసాయనిక ఎరువుల వాడకంతో వరి పంట సాగు చేయడం సరికాదన్న విషయాన్ని రైతులు గ్రహించాలన్నారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన ధాన్యం ద్వారా వచ్చిన బియ్యంతో వండిన అన్నం తింటే ఆరోగ్యాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. అనంతరం చిన్నికృష్ణున్ని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో గూపన్‌పల్లి మాజీ ఉపసర్పంచ్ చిటికెల శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...