క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయం


Fri,November 8, 2019 03:49 AM

నిజామాబాద్ సిటీ: ఫుట్‌బాల్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీసుకురావడానికి చేస్తున్న కృషి అభినందనీయని జాతీయ ఫుట్‌బాల్ మహిళా జట్టు మేనేజర్ జీపీ ఫాల్గుణ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో నిజామాబాద్ కేర్ ఫుట్‌బాల్ అకాడమీ, నిజామాబాద్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ మహిళా జట్టు మేనేజర్ ఫాల్గుణకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాల్గుణ మాట్లాడుతూ.. జాతీయ పుట్‌బాల్ మహిళా జట్టు మేనేజర్ పదవి అలంకరించడానికి స్ఫూర్తి నిజామాబాద్ జిల్లా ఫుట్‌బాల్ అని గర్వంగా చెప్పుకుంటున్నానని అన్నారు. నిజామాబాద్ జిల్లా ఫుట్‌బాల్ అకాడమీ, కేర్ ఫుట్‌బాల్ అకాడమీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

జిల్లా నుంచి దాదాపు 20 మంది జాతీయ క్రీడాకారులుగా ఎదగడం చాలా గొప్ప విషయమని, ఏ జిల్లాకు సాధ్యం కాలేదన్నారు. జిల్లా చేస్తున్న కృషిని గుర్తించి వచ్చే నెలలో తెలంగాణ ఉమెన్స్ ఫుట్‌బాల్ లీగ్‌ను నిర్వహించడానికి అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. మారయ్యగౌడ్ మాట్లాడుతూ.. జిల్లా క్రీడా రంగానికి తనవంతు సహకారం అందిస్తామని తెలిపారు. కేర్ ఫుట్‌బాల్ అకడమీ చైర్మన్ నరాల సుధాకర్ మాట్లాడుతూ.. తమకు ఉమెన్స్ లీగ్‌ను కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపి శాయశక్తుల పనిచేసి క్రీడాకారులను అందిస్తామన్నారు. అనంతరం ఫాల్గుణను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మహ్మద్ షకీల్, ఎంఏ ఖలీల్, ఫుట్‌బాల్ జాతీయ క్రీడాకారిణి గుగులోత్ సౌమ్య, జాతీయ క్రీడాకారులు స్నేహ, మనీషా, నమృత, కోచ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...