శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప ఇన్‌ఫ్లో


Fri,November 8, 2019 03:49 AM

మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి గురువారం 10,120 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోందని ఏఈఈ మహేందర్ తెలిపారు. ఎస్కేప్ గేట్ల నుంచి 2,500 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 5,500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా, గురువారం సాయంత్రానికి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం కలిగి ఉందన్నారు. ప్రాజెక్టు నుంచి 8 వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో పోతున్నట్లు ఏఈఈ తెలిపారు.

జెన్‌కోలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి...
ఎస్సారెస్పీ జెన్‌కో కేంద్రంలో నాలుగు టర్బయిన్లతో విద్యుదుత్పత్తి కొనసాగుతోందని డీఈ శ్రీనివాస్ తెలిపారు. నాలుగు టర్బయిన్లతో 36.6 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోందన్నారు. ఈ ఆర్థ్ధిక సంవత్సరంలో 15.6266 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగిందన్నారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...