తలపై టీవీ పడి బాలుడి మృతి


Thu,November 7, 2019 01:16 AM

రెంజల్ : ఇంట్లో ఆడుకుంటుండగా టీవీ మీద పడడం తో చిన్నారి మృతిచెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్ట తండాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వీరన్నగుట్ట తండాకు చెందిన రాథోడ్ హరి, నందిని దంపతుల రెండో సంతానమైన హర్ష (18 నెలల) బాలుడు ఈ నెల 3న మధ్యాహ్నం ఇంట్లో ఆడుకుంటుండగా వేళాడుతున్న వైరును పట్టుకొని లాగడంతో ప్లాస్టిక్ టేబుల్‌పై ఉన్న 32 ఇంచుల కలర్ టీవీ తలపై పడింది. ఈ ఘటనలో బాలుడి మెడ భాగంలో నరాలకు బలమైన గాయాలు కావడంతో స్పృహ కోల్పోయాడు. ఇంటి బయట పనిచేస్తున్న తల్లి నందిని కొద్దిసేపటికి వచ్చి చూడగా బాలుడు కనిపించలేదు. లోపలికి వెళ్లిచూడగా బాలుడి తలపై టీవీ పడి ఉంది.

అప్పటికే ప్రాణాపాయ స్థితికి చేరిన బాలుడిని అంబులెన్సులో నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. తలభాగంలో తీవ్ర గాయాలు కావడంతో వైద్యుల సిఫార్సు మేరకు అదే రోజు రాత్రి హైదరాబాద్‌లోని ఉస్మానియా దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో దవాఖానలో బుధవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు రెంజల్ పోలీసులు తెలిపా రు. బాలుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని ఉస్మానియా దవాఖానలో శవ పరీక్ష నిర్వహించి మృతదేహాన్ని తల్లిదండ్రులకు ఆప్పగించారు. కేసు నమో దు చేసుకున్నట్లు ఏఎస్సై రియాజ్ తెలిపారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...