రక్తదానం, అవయవదానంపై అవగాహన పెంచుకోవాలి


Thu,November 7, 2019 01:15 AM

శక్కర్‌నగర్: విద్యార్థులు రక్తదానం, అవయవదానం ఆవశ్యకత తెలుసుకోవాలని రాష్ట్ర అవయవదాతల సంఘం అధ్యక్షురాలు కాట్రగడ్డ భారతి అన్నారు. బుధవారం బోధన్ పట్టణంలోని ఉషోదయా డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌లో భాగంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె పలు సూచనలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఆపత్కాలంలో, క్లిష్ట పరిస్థితుల్లో చాలామంది రక్తం లేక ఇబ్బందులు పడుతున్నారన్నా రు. అవయవదానంపై కూడా అవగాహన పెంచుకోవాలని, ఈ విషయాల్లో తమ కుటుంబీకులతో పాటు చుట్టుపక్కల వారికి విద్యార్థులు అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులు ఇలాంటి అవకాశాలను వినియోగించుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ భవానీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు, కార్యదర్శి సాయిబాబా, ప్రతినిధులు పావులూరీ వెంకటేశ్వర్‌రావు, అల్యుమిని అధ్యక్షుడు షేక్ అల్మాస్, కార్యదర్శి షేక్ ఆసీం, రవి, అశ్వక్, కళాశాల చైర్మన్ సూర్యప్రకాశ్, ప్రిన్సిపాల్ గంగాధర్, ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు సంతోష్, శ్రీకాంత్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...