ఆగని ప్రయాణం!


Wed,November 6, 2019 01:33 AM

నిజామాబాద్‌ సిటీ : నిజామాబాద్‌, కామారెడ్డి ఉభయ జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రయాణికులు క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లు విధులకు హాజరై సేవలంది స్తున్నారు. మంగళవారం నిజామాబాద్‌ ఆర్టీసీ రీజియన్‌ పరిధిలో 479 బస్సులు నడిచాయి. ఓవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుండగా.. మరోవైపు మంగళవారం రీజియ న్‌ పరిధిలో ఆరుగురు ఆర్టీసీ కార్మికులు డ్యూటీలో చేరేందు కు సమ్మతి పత్రాలు ఆర్‌ఎంకు అందజేశారు. ప్రభుత్వం ఇచ్చిన డెడ్‌లైన్‌ ప్రకారం మంగళవారం రాత్రి వరకు నిజా మాబాద్‌ జిల్లాలో ఐదుగురు కార్మికులు చేరితే, కామారెడ్డి జిల్లాలో ఇద్దరు డ్యూటీలో చేరినట్లు ఆర్‌ఎం సోలోమాన్‌ తెలిపారు.

నిజామాబాద్‌ జిల్లాలో...
నిజామాబాద్‌ జిల్లాలో మంగళవారం మొత్తం 291 బస్సులు నడిచాయి. ఇందు లో ఆర్మూర్‌ డిపో పరి ధిలో 70 , బోధన్‌ పరిధి లో 78, నిజామాబాద్‌-1 పరిధిలో 74, నిజామాబాద్‌-2 డిపో పరిధిలో 69 బస్సులు నడిచాయి.

కామారెడ్డి జిల్లాలో...
కామారెడ్డి జిల్లాలో మంగళవారం మొత్తం 188 బస్సులు తిరిగాయి. ఇందులో బాన్సువాడ డిపో పరిధిలో 84, కామారెడ్డి డిపో పరిధిలో 104 బస్సులు నడిచాయి.

శక్కర్‌నగర్‌: బోధన్‌ పట్టణంలోని ఆర్టీసీ డిపో నుంచి వివిధ ప్రాంతాలకు మంగళవారం అధి కారులు 71 బస్సు సర్వీసులను కొనసా గించారు. బోధన్‌ డిపోలోని 40 బస్సులను, ఆర్టీసీలో అద్దెపై కొనసాగుతున్న 31 బస్సులను వివిధ ప్రాంతాలకు నడిపారు. బోధన్‌ నుంచి హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, బాన్సువాడతో పాటు వివిధ గ్రామీణ ప్రాంతాలకు బస్సులను కొనసాగించారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన గడువు మంగళవారం కావడంతో ఎవరైనా విధుల్లోకి చేరేందుకు వస్తే వారికి రక్షణగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బోధన్‌ డిపోతో పాటు, బస్టాండ్‌లో పోలీసుల బందోబస్తు కొనసాగింది. పరిస్థితులను డీఎం రమణ పర్యవేక్షించారు.

డ్యూటీలో చేరిన ఐదుగురు..
నిజామాబాద్‌ సిటీ : నిజామాబాద్‌ ఆర్టీసీ రీజియన్‌ పరిధిలో మంగళవారం ఐదుగురు సిబ్బంది విధుల్లో చేరారు. ఈనెల 5వ తేదీ అర్ధరాత్రిలోపు ఆర్టీసీ కార్మికులు డ్యూటీలో చేరాలని సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు వారు విధుల్లో చేరారు. మంగళవారం నిజామాబాద్‌-2 డిపోకు చెందిన కండక్టర్‌ కె. సంతోష్‌కుమార్‌(స్టాఫ్‌ నం.676355), సీనియర్‌ అసిస్టెంట్‌ జేఎస్‌రెడ్డి (స్టాఫ్‌ నం.303571), బాన్సువాడ డిపో కండక్టర్‌ ఉదయకిరణ్‌ (స్టాఫ్‌ నం. 928605) విధుల్లో చేరారు. నిజామాబాద్‌ ఆర్టీసీ ఆర్‌ఎం సోలోమాన్‌కు వీరు సమ్మతి పత్రం అందజేశారు. నిజామాబాద్‌-1వ డిపోకు చెందిన డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఎల్‌.శ్రీలత కలెక్టరేట్‌కు వెళ్లి డ్యూటీలో చేరుతున్నట్లు రిపోర్టు చేసింది. నిజామాబాద్‌-2 డిపోకు చెందిన డ్రైవర్‌ బి.నర్సింహులు వికారాబాద్‌ డిపోకు వెళ్లి అక్కడ మేనేజర్‌ను కలిసి రిపోర్టు చేశారు. సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు తాము భేషరతుగా విధుల్లో చేరుతున్నట్లు లేఖలో వా రు పేర్కొన్నారు. నెలరోజులుగా వేతనం రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సమ్మెను వీడి స్వచ్ఛందంగా డ్యూటీ లో చేరతున్నట్లు వారు పేర్కొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...