ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి


Tue,November 5, 2019 03:23 AM

ఖలీల్‌వాడి: ఆయా శాఖలకు సంబంధించిన కోర్టు కేసుల వివరాలు ఎప్పటికప్పుడు అందించాలని, ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ రామ్మోహన్‌రావు అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్‌లోని సమావేశం మందిరంలో పలు విషయాలపై ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయా శాఖలకు సంబంధించిన కోర్టు కేసుల వివరాలను దానికి సంబంధించిన పరిస్థితిని ఎప్పటికప్పుడు కలెక్టరేట్‌కు తెలియజేయాలని, పేరావైజ్ వివరాలు ఆ కేసు హైకోర్టుకు సంబంధించినదా.. లేక జిల్లా, ఇతర కోర్టులకు సంబంధించినదా తెలుపాలని, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలని తెలిపారు. ఇది నిర్ధిష్ట సమయంలో జరగాలని కేసు తదుపరి హియరింగ్ ఎప్పుడు ఉన్నదో తెలపాలని, లేదంటే కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందని తెలిపారు. జిల్లా అధికారులు అన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కోర్టు కేసులతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే లేఖలు, రాష్ట్ర ప్రభుత్వ లేఖలు, మానవ హక్కుల కమిషన్, ఇతర కమిషన్లు ఆదేశాలు ప్రత్యేక విభాగంగా చూడాలని, వీటిపై అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు.

ఏ స్థాయి సమస్యలను ఆస్థాయిలోనే పరిష్కరించాలి
ప్రజవాణి ఫిర్యాదులకు సంబంధించి ఆ ఫిర్యాదు ఏ స్థాయిలో పరిష్కారాం కావాలో ఆ స్థాయిలో అంటే మండల, డివిజన్, జిల్లా స్థాయిలో పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. చాలా ఫిర్యాదులు మండల స్థాయిలోనే పరిష్కరించవలసి ఉన్నప్పటికీ ఆ ఫిర్యాదులు జిల్లా స్థాయికి వస్తున్నామని అన్నారు. జిల్లా అధికారులు ఈ విషయంలో దిగువస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. పోలీస్, ఎంప్లాయిమెంట్, నిజామాబాద్ ఆర్డీవో, పింఛన్లు, పౌరసరఫరాలు, పంచాయతీ, మున్సిపాలిటీలు, తదితర శాఖలకు సంబంధించి ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయన్నారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధతో వీటిని వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...