భవన నిర్మాణ పనుల నివేదికను అందించాలి


Tue,November 5, 2019 03:23 AM

విద్యాసంస్థలు, వసతి గృహాలకు సంబంధించిన కొనసాగుతున్న పనులు, భవనాల నిర్మాణాలు, ఇతర పనులకు సంబంధించి నివేదికలను శుక్రవారంలోగా అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంజినీరింగ్ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న అన్ని రకాల నిర్మాణాల వివరాలను సమర్పించాలని తెలిపారు. వాటితో పాటు విద్యా సంస్థలు, ఇతర శాఖల ఆస్తుల వివరాలు, భవనాల నిర్మాణాలు, ప్రస్తుతం వినియోగిస్తున్నవి త్వరలో ఉపయోగంలోకి రానున్నవి, నిర్మాణాలు పూర్తి కావడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో, ఖాళీగా ఉన్న స్థలాల వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖల్లో కిందిస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎక్కడ కూడా ప్రజల పనులు ఆలస్యం కాకుండా చూడాలని, అవినీతికి ఆస్కారం లేకుండా అధికారులు పర్యవేక్షణ చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వీవో అంజయ్య, ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీవో రమేశ్ రాథోడ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...