ఆసరా పింఛన్ లబ్ధిదారుల సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్


Tue,November 5, 2019 03:23 AM

ఖలీల్‌వాడి: ఆసరా పింఛన్ లబ్ధిదారుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన కాల్ సెంటర్‌కు సంబంధించిన పోస్టర్‌ను కలెక్టర్ రామ్మోహన్‌రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆసరా పింఛన్ లబ్ధిదారులు జిల్లా కేంద్రానికి రాకుండానే కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేస్తే సమస్యలు పరిష్కారిస్తారని చెప్పారు. ఈ కాల్ సెంటర్‌కు లబ్ధిదారులు ఫోన్ చేస్తే వెంటనే నమోదు చేసుకుంటారని, ఆ తర్వాత సంబంధిత మండల, జిల్లా అధికారులకు ఆన్‌లైన్ ద్వారా సమాచారం అందిస్తారని తెలిపారు. వచ్చిన వినతిపై సంబంధిత సిబ్బంది విచారణ చేసి ఆన్‌లైన్ ద్వారానే పరిష్కారం తెలియజేస్తారన్నారు. ఇందు కోసం జిల్లా సమాఖ్యలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ నంబర్ 7032812777 ద్వారా వినతులను తెలియజేయవచ్చునని తెలిపారు. ఆసరా పింఛన్ లబ్ధిదారులు తమ సమస్యలను మండల, జిల్లా కార్యాలయాలకు వెళ్లకుండానే జిల్లా సమాఖ్య కాల్ సెంటర్ ద్వారా ఉచితంగా పరిష్కారం పొందవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్డీవో రమేశ్ రాథోడ్, ఆర్డీవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

102
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...