రాష్ట్రస్థాయి హాకీ పోటీలు ప్రారంభం


Tue,November 5, 2019 03:22 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 65వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-17 బాలికల రాష్ట్ర స్థాయి హాకీ పోటీలను కలెక్టర్ సత్యనారాయణ సోమవారం ప్రారంభించారు. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా, స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అసిస్టెంట్ కలెక్టర్ తేజాస్ నందలాల్ పవర్ పాల్గొని క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో మూడు రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో విద్యార్థినులు తమ ప్రతిభ కనబర్చి పంజాబ్‌లో నిర్వహించే జాతీయ స్థాయి హాకీ పోటీల్లో విజేతలుగా రాణించాలన్నారు. హాకీ ద్వారా విద్యార్థుల్లో ఐక్యత ఏర్పడుతుందన్నారు. స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ... క్రీడాకారులు చదువుతో పాటు క్రీడల్లో నైపుణ్యాన్ని కనబర్చాలన్నారు. ఈ టోర్నీలో పాల్గొనే క్రీడాకారుల్లోంచి 18 మందిని జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ తేజాస్ నందలాల్ పవర్ మాట్లాడుతూ క్రీడాకారులు తమ అసమానమైన ప్రతిభతో రాష్ర్టానికి గుర్తింపు తేవాలన్నారు. ఎస్‌జీఎఫ్ సెక్రటరీ లింగం మాట్లాడుతూ... జిల్లాలో క్రీడాకారులకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఈవో రాజు, ఎస్‌జీఎఫ్ ప్రతినిధులు ఆంజనేయులు, బ్రహ్మరాజు, వీరారాజు, మధుసూదన్, నిజామాబాద్ హాకీ అధ్యక్షుడు రమణ, టీం మేనేజర్లు, పరిశీలకుడు లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.

పాత పది జిల్లాల నుంచి పది జట్లు
రాష్ట్రంలోని పాత పది జిల్లాల నుంచి పది జట్లు పోటీల్లో పాల్గొంటున్నాయి. ఒక్కో జట్టులో 18 మంది ఉండగా మొత్తం 180 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వీరికి స్టేడియంలో సమీపంలోని ఇంటిగ్రేటెడ్ బాలికల హాస్టల్‌లో వసతి కల్పించారు.
మొదటి రోజు శుభారంభం..
మొదటి రోజు మహబూబ్‌నగర్- ఆదిలాబద్ జట్లు తలపడగా 4-0 తో మహబూబ్‌నగర్ విజేతగా నిలిచింది. అలాగే హైదరాబాద్- ఖమ్మం జట్లు తలపడగా డ్రా అయ్యింది. మెదక్ - వరంగల్ జట్లు తలపడగా 6-0తో వరంగల్ విజేతగా నిలిచింది. నిజామాబాద్ - నల్గ్గొండ జట్లు తలపడగా 2-0 గోల్స్‌తో నిజామాబాద్, మెదక్- రంగారెడ్డి జట్లకు జరిగిన పోటీలో రంగారెడ్డి జట్టు 9-0తో విజేతగా నిలిచింది.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...