ఆర్టీసీ పిలుస్తోంది !


Tue,November 5, 2019 03:22 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు ఆర్టీసీ కార్మిక లోకం నుంచి స్పందన వస్తున్నది. ఇప్పటికే కార్మిక కుటుంబాల్లో జరిగిన చర్చోపచర్చల ఫలితం విధుల్లో చేరేందుకే సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం అర్థరాత్రి వరకు ప్రభుత్వం గడువు ఇచ్చిన నేపథ్యంలో.. మంగళవారం (నేడు) సాయంత్రంలోగా కార్మికులు పెద్ద ఎత్తున విధుల్లో చేరేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా కార్మికలోకంలో కదలిక వచ్చింది. ఒక్కొక్కరుగా విధుల్లో చేరేందుకు వరుస కట్టారు. నిజామాబాద్ రీజియన్ పరిధిలో కామారెడ్డి జిల్లాలో ఓ డ్రైవర్ విధుల్లో చేరిన విషయం తెలిసిందే. మరోవైపు సీఎం కేసీఆర్ ఇచ్చిన గడువు మంగళవారం అర్థరాత్రితో ముగియనున్నది. ఈ నేపథ్యంలో సాయంత్రంలోగా మూకుమ్మడిగా విధుల్లో చేరాలనే యోచనలో కార్మికులున్నారు. పలు ధపాలుగా సీఎం కేసీఆర్ సమావేశాలు నిర్వహించి ఆర్టీసీ పరిస్థితి, కార్మిక నాయకుల వైఖరి పై కూలంకశంగా విడమర్చి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో కార్మిక లోకంలో అంతర్మథనం మొదలైంది. కార్మికుల కుటుంబాల్లో చర్చ జరిగింది.

ఆర్టీసీని కాపాడే బాధ్యత తనదని, కార్మికుల సంక్షేమం కోసం పాటుపడతాననే సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించడం వారిలో కొత్త ఆశలను చిగురింపజేశాయి. గతంలో ఉన్న పెండింగ్ సమస్యలతో పాటు కార్మికుల సంక్షేమం కోసం పలు సంస్కరణలను, కొత్త పద్ధతులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్న తరుణంలో కార్మికులు సమ్మెబాట వీడి విధుల్లో చేరేందుకు సంసిద్ధమవుతున్నారు. ఆర్టీసీ కాపాడుకోవాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన లభిస్తున్నది. కార్మిక నాయకుల ముసుగులో కొందరు చేస్తున్న రాజకీయ కుట్రలకు కార్మిక కుటుంబాలు బలి కావద్దనే కేసీఆర్ సూచన ఆ కుటుంబాల్లో బలంగా పనిచేసింది. దీంతో అంతర్మథనం మొదలై కదలిక వస్తోంది. తుది గడువు సమీపిస్తున్న సమయంలో ఇక డ్యూటీ బాట పట్టేందుకు వరుస కట్టే సందర్భం ఆవిష్కరించే అవకాశం కనబడుతున్నది.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...