బేఖాతర్!


Mon,November 4, 2019 12:44 AM

-ఇన్‌చార్జి వీసీ వద్దన్నా..
-టీయూలో కొనసాగుతున్న నలుగురు ఔట్‌సోర్సింగ్ సిబ్బంది
-దొడ్డిదారిన వారికి వేతనాలు చెల్లింపు..?
-మండిపడుతున్న తొలగింపునకు గురైన ఔట్‌సోర్సింగ్ సిబ్బంది

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్ నెలలో చేర్చుకున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించాలని ఇన్‌చార్జి వీసీ అనిల్‌కుమా ర్ ఆదేశించారు. అయినప్పటికీ విద్యార్థి సంఘ నాయకుల ఒత్తిడికి తలొగ్గిన రిజిస్ట్రార్ బలరాములు సంబంధిత నలుగురు సిబ్బందికి వేతనాలు చెలించడం చర్చనీయాంశమైంది. వీసీకి తెలియకుండానే రిజిస్ట్రార్ గతంలో 26 మందికి ఔట్ సోర్సింగ్‌పై ఉద్యోగులు ఇచ్చారు. 13 మందికి జూనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇచ్చారు. ఈ వ్యవహారం తన దృష్టికి రావడంతో ఇన్‌చార్జి వీసీ అనిల్ కుమార్ గత నెలలో రిజిస్ట్రార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా చేర్చుకున్న వారిని తొలగించి ప్రమోషన్లు రద్దు చేయాలని స్పష్టం చేశారు. కానీ, నెల రోజులుగా భిక్కనూరు సౌత్ క్యాంపస్‌లో ఇద్దరు, సారంగపూర్ బీఈడీ కళాశాలలో ఇద్దరు సిబ్బంది విధులకు హాజరవుతూనే ఉన్నా రు. ఈ నలుగురికి అక్టోబర్ నెల వేతనం చెల్లించాలని పలువురు విద్యార్థి సంఘ నాయకులు రిజిస్ట్రార్‌కు మొరపెట్టుకున్నారు. దీంతో ఇన్‌చార్జి వీసీ ఆదేశాలు పట్టించుకోకుండా విద్యార్థి సంఘ నాయకుల ఒత్తిడితో, సంబంధిత నలుగురు ఔట్ సోర్సింగ్ సిబ్బందికి అక్టోబర్ నెల వేతనం చెల్లించినట్లు యూనివర్సిటీ ఉద్యోగుల ద్వారా తెలిసింది.

ఈ వ్యవహారంలో రిజిస్ట్రార్ తీరుపై మిగతా ఔట్ సోర్సింగ్ సిబ్బంది గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. కొత్తగా చేర్చుకున్న వారిని తొలగించాలని ఇన్‌చార్జి వీసీ ఆదేశించినప్పటికీ, నలుగురిని మాత్రం ఎలా కొనసాగిస్తూ వచ్చారని, వేతనాలు ఎందుకు చెల్లించారని వారు మండిపడుతున్నారు. విశ్వవిద్యాలయంలో భూములు కోల్పోయి నిర్వాసితులైన నిరుద్యోగులకు టీయూ అధికారులు ఉద్యోగాలు కల్పించకుండా, బయట వ్యక్తులకు ఉద్యోగాలు కల్పించి తమ పొట్టను కొట్టడం ఎంతవరకు సమంజసమని భూములు కోల్పోయిన బాధితులు పింటు, మోతీలాల్‌తో పాటు తదితర మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు ఇస్తామని భూములు తీసుకున్న అధికారులు, 25 రోజులు తమతో వెట్టిచాకిరి చేయించుకొని ఉద్యో గం నుంచి తొలగించడం సమంజసమా అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...