ట్రాక్టర్ల కొనుగోలుకు రుణాలివ్వాలి


Wed,October 23, 2019 02:29 AM

- బ్యాంకు అధికారుల సమావేశంలో కలెక్టర్‌ రామ్మోహన్‌రావు

ఖలీల్‌వాడి: ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను సమకూర్చడానికి బ్యాంకు లు రుణాలు అందించాలని కలెక్టర్‌ రామ్మోహన్‌రావు తెలిపారు. తన చాంబరులో మంగళవారం బ్యాంకు అధికారులు, పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణలో భాగంగా చెత్తను సేకరించడానికి, డంపింగ్‌ చేయడానికి, హరితహారం మొక్కలకు నీటిని అందించడానికి ఇతర కార్యక్రమాలకు ట్రాక్టర్లను ఏ ర్పాటు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. పంచాయతీలు క్లీన్‌ అండ్‌ గ్రీన్‌గా ఉండాలంటే గ్రామ పంచాయతీలు తప్పనిసరిగా ట్రాక్టర్లను సమకూర్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్‌ కొనుగోలు చేసుకోవాలని, ఇందుకు బ్యాంకులు వారి యాజమాన్యాలతో మాట్లాడి కమర్షియల్‌గా కాకుండా తక్కు వ వడ్డీతో రుణాలు అందజేయాలని సూచించారు.

36 నుంచి 40 వాయిదాల్లో తిరిగి చెల్లించే విధంగా రుణా లు మంజూరు చేయాలని కలెక్టర్‌ బ్యాకు అధికారులకు తెలిపారు. ట్రాక్టర్ల కొనుగోలుకు కలెక్టర్‌ చైర్మన్‌గా, జిల్లాలో కమిటీలు ఏర్పాటుచేసి వాటి మోడల్‌, ధరలు, ఇతర వివరాలను పరిశీలించుకొని కొనుగోలుకు చర్య లు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీలు జీపీ ఆదాయాల నుంచి లేదా 14వ ఫైనాన్స్‌ కమిషన్‌ నిధుల నుంచి లేదా ఇతర నిధుల నుంచి బ్యాంకులకు రుణ వాయిదాలు చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. గ్రామ పంచాయతీలు గ్రామ సభల ద్వారా తీర్మానం చేయాలని సూచించారు. ఈ నెల 25వ తేదీలోగా ట్రాక్టర్ల కొనుగోలుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో డీపీవో జయసుధ, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ జయసంతోష్‌, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles