కొనుగోలు కేంద్రాల్లో సకల సౌకర్యాలు


Wed,October 23, 2019 02:28 AM

కోటగిరి/ వర్ని : వానాకాలం సీజన్‌లో రైతులు సాగు చేసిన పంటలు చేతికొచ్చాయని, కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని టీఆర్‌ఎస్‌ బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జీ పోచారం సురేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం కోటగిరి మండలంలోని కొత్తపల్లి, ఎత్తొండ, యాద్గార్‌పూర్‌, పొతంగల్‌, వర్ని మండలంలోని హుమ్నాపూర్‌ సహకార సంఘా ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సీజన్‌లో రైతులు పండించిన పంట నుంచి ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని, రైతులు అందోళన చెందవద్దని సూచించారు. అకాల వర్షాలకు పంట దెబ్బతినే ప్రమాదం ఉందని, వరి, సోయా పంట తడిచినా కొనుగోలు చేసేలా కృషి చేస్తామన్నారు. గన్నీ బస్తాలు, రవాణా, హమాలీల సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ధాన్యం తీసుకొచ్చే సమయంలోనే బ్యాంకు ఖాతా, వీఆర్‌వో ధ్రువీకరణ పత్రం వెంట తెచ్చుకుంటే డబ్బులు సకాలంలో అం దుతాయన్నారు.

అలీసాగర్‌ ఎత్తిపోతల ద్వారా సాగు నీరు..
కాళేశ్వరం నుంచి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి నీరు వచ్చిందని, అక్కడి నుంచి అలీసాగర్‌ బ్యాక్‌ వాటర్‌ను పైప్‌లైన్‌ ద్వారా నిజాంసాగర్‌ 28 కాలువ ద్వారా వచ్చే సీజన్‌ నుంచి ఆయకట్టు రైతులకు సాగునీటిని అందిం చే చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. దీనిపై స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా బాన్సువాడ నియోజకవర్గంలోనే అధిక శాతం డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం కొనసాగుతుందన్నారు. ఎత్తొండలో వరి, సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, శనగ విత్తనాల పంపిణీ కేంద్రాన్ని పోచారం సురేందర్‌రెడ్డి, ఎంపీసీ వల్లెపల్లి సునీత, జడ్పీటీసీ శంకర్‌పటేల్‌ ప్రారంభించారు.

పేదలకు వరం.. సీఎంఆర్‌ఎఫ్‌
పేదలు కార్పొరేట్‌ వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో చేయూతనందించేందుకు ప్రభత్వం ప్రవేశపెట్టిన సీఎంఆర్‌ఎఫ్‌ ఒక వరమని పోచారం సురేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని కొత్తపల్లి, ఎత్తొండ, పొతంగల్‌ గ్రామాల్లో పలువురు బాధితులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు. సాయం అందించేందుకు కృషి చేసిన స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, పోచారం సురేందర్‌రెడ్డికి పలువురు బాధితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కొత్తపల్లిలో ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కోటగిరి ఎంపీపీ సునీత, జడ్పీటీసీ శంకర్‌పటేల్‌, జడ్పీ కోప్షన్‌ సభ్యుడు సిరాజ్‌, మండల కన్వీనర్‌ ఎజాజ్‌ఖాన్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నీరడి గంగాధర్‌, వర్ని ఎంపీపీ మేక శ్రీలక్ష్మి, వర్ని జడ్పీటీసీ హరిదాసు, రుద్రూర్‌ జడ్పీటీసీ నారోజి గంగారాం, అధికారులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...