మంత్రిని కలిసిన ఎంపీపీలు, జడ్పీటీసీలు


Mon,October 21, 2019 04:17 AM

ఇందల్వాయి : నిజామాబాద్ రూరల్ మండలానికి చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, బంజారా నాయకులు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డిని ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. భీమ్‌గల్‌లోని వారి నివాసంలో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. 300 మంది జనాభా ఉన్న ప్రతీ తండాను గ్రామ పంచాయతీగా మార్చారని అన్నారు. గిరిజనుల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. సంత్ సేవాలాల్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు. తండాల్లో గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు చేయాలని, పోడు భూములను ఏండ్ల తరబడి సాగు చేస్తున్న గిరి పుత్రులకు పట్టాలు అందజేయాలని ఆలిండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు రామావత్ మోహన్ నాయక్ మంత్రిని కోరారు. కార్యక్రమంలో ఇందల్వాయి ఎంపీపీ బాదావత్ రమేశ్ నాయక్, శార్మాన్ నాయక్, సిరికొండ ఎంపీపీ రాజేందర్ నాయక్, జడ్పీటీసీ సభ్యుడు మాన్ సింగ్ నాయక్, బంజారా సంఘం నాయకులు లాల్‌సింగ్ నాయక్, రాంచందర్, శివరాం, గోపాల్, తుకారాం, బలారాం నాయక్, కమల, నరేశ్, ప్రతాప్, ప్రేం, గోపాల్, బాబు, గులాబ్, శంకర్, శ్రీనివాస్, చందర్ తదితరులు పాల్గొన్నారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...