శిఖర ప్రతిష్ఠాపన మహోత్సవం


Mon,October 21, 2019 04:15 AM

రెంజల్: మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలో ఆదివారం పెద్ద పొచమ్మ, నల్ల పోచమ్మగుడిపై శిఖర ప్రతిష్ఠాపన మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గుడి ఆవరణలో గణపతిపూజ, యజ్ఞం, కలష పూజ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. మహిళలు మంగళ హారతులతో గుడికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు రోజుల పాటు గ్రామదేవత గుడి వార్షికోత్సవం కారణంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. సర్పంచ్ సునీత, ఎంపీటీసీ సభ్యరాలు లక్ష్మి, ఆలయ కమిటీ చైర్మన్ రవీందర్‌గౌడ్, నాయకులు నర్సయ్య, లింగారెడ్డి, మల్లసాయిలు, సుధాకర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...