రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని మృతదేహం


Sun,October 20, 2019 04:26 AM

కామారెడ్డిరూరల్ : కామారెడ్డి మండలంలోని అడ్లూర్ గ్రామ శివారులోని గరండాలు సమీపంలో రైల్వేట్రాక్‌పై గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. విషయం గమనించిన రైల్వే సిబ్బంది రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై తావూ నాయక్, దేవునిపల్లి ఎస్సై శ్రీకాంత్ సంఘటన స్థలంలో వివరాలు సేకరించారు. మృతదేహంపై ప్యాటు మాత్రమే ఉండడం, తలభాగం లేకపోవడంతో పరిసర ప్రాంతంలో సుమారు రెండు వైపులా రెండు కిలోమీటర్ల మేర తల కోసం పోలీసులు గాలించినా ఫలితం లేకపోయింది. మృతదేహం సమీపంలో నీలం రంగు షర్ట్, టవల్, ఒక తాళం చెవి దొరికినట్లు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం 10.30 గంటల సమయంలో కేఎం నం 507 మధ్యలో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి వయస్సు సుమారు 55 ఏండ్లు ఉంటాయని, ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ వ్యక్తికి సంబంధించి ఎవరికైనా సమాచా రం తెలిస్తే 94407 00034,97032 17723 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. మృతదేహాన్ని కామారెడ్డి ఏరియా వైద్యశాలకు పోస్టుమార్టం కోసం తరలించినట్లు తెలిపారు. సంఘటనా స్థలాన్ని కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి పరిశీలించారు.

ఎక్కడో హత్య చేసి ట్రాక్‌పై పడేశారా..?
అడ్లూర్ శివారులోని గరండాలు వద్ద పెద్దపెద్ద పొదలతో నిర్మాణుష్యంగా ఉంటుంది. మృతుడు ఆత్మహత్య చేసుకుంటే ట్రాక్‌పై శరీర భాగాలు పడి ఉండేవి. రక్తపు మరక లు రైల్వే ట్రాక్‌పై కనిపించేవి. కానీ మృతదేహం వద్ద ఎలాంటి రక్తపు, మాంసపు గుర్తులు లేవు. ట్రాక్ మధ్యలో మృతదేహం ఉండడంతో ఒక కాలు మాత్రమే తెగిపోయిం ది. ఎక్కడో హత్య చేసి ఇక్కడకు తీసుకొచ్చినట్లు అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని గుర్తుపట్టకుం డా, ఎలాంటి ఆధారాలు మృతుడి వద్ద దొరకకపోవడం, తల భాగం ముందే వేరు చేసి ట్రాక్‌పై మొండాన్ని పడేసి ఆత్మహత్యగా నిందితులు చిత్రీకరించినట్లు తెలుస్తున్నది. మృతుడి మర్మాంగాలను సైతం కోసేసిన ఆనవాళ్లున్నాయి. దీన్ని బట్టి వివాహేతర సంబంధంతో ఈ దారుణానికి నిందితులు ఒడిగట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నా యి.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles