కట్టుదిట్టమైన భద్రత


Sun,October 20, 2019 04:25 AM

నిజామాబాద్ క్రైం : ఆర్టీసీ కార్మికులు, వామపక్షలు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన తరుణంలో ముందస్తు చర్యలో భాగంగా పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించింది. శనివారం తెల్లవారుజాము 4 గంటల నుంచి పోలీస్ బలగాలు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలోని ఆర్టీసీ బస్సు డిపోలు, బస్టాండ్‌ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వేయి మంది బలగాలతో ప్రధాన కూడలి, జంక్షన్ వద్ద పికెట్లతో పాటు మొబైల్ పెట్రోలింగ్ నిర్వహించారు. అదనపు డీసీపీ శ్రీధర్ రెడ్డి పర్యవేక్షణలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు శ్రీనివాస్ కుమార్, రాములు, రఘు ఆధ్వర్యంలో సంబంధిత సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు సిబ్బందితో కలిసి బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు.

చట్ట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలో 210 మంది, ఆర్మూర్ పరిధిలో 79 , బోధన్ డివిజన్‌లో 151, మొత్తం 440 మంది ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకొని సంబంధిత పోలీస్ స్టేషన్లకు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. బందోబస్తులో సీఐలు రఘునాథ్, శ్రీనాథ్ రెడ్డి, ఆంజనేయులుతో పాటు సంబంధిత అన్ని స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు, ఎస్సైలు, స్పెషల్ పార్టీ బలగాలు, మహిళా సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...