ఇసుక రవాణా చేస్తున్న వాహనాల పట్టివేత


Thu,October 17, 2019 12:47 AM

శక్కర్‌నగర్: బోధన్ శివారులోని వివిధ ప్రాంతాల మీదుగా ఇసుక తరలిస్తున్న పలు వాహనాలను బోధన్ రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. రెండు రోజులుగా నిర్వహిస్తున్న తనిఖీల్లో భాగంగా మంగళవారం రాత్రి ఇసుక రవాణా చేస్తున్న నాలుగు వాహనాలు పట్టుకుని తహసీల్ కార్యాలయంలో సీజ్ చేశారు. రాత్రి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు రెవెన్యూశాఖలోని కొందరు అధికారులు చర్యలు చేపడుతుండగా, మరికొందరేమో ఇసుక అక్రమ రవాణా చేసే వ్యక్తులకు సహకరిస్తున్నారని ఆరోపణలున్నాయి. అధికారులు తనిఖీలకు వెళ్తే వారు ఏ ప్రాంతానికి, ఎటు వైపునుంచి వస్తున్నారనేది ఇసుక రవాణా చేసే వ్యక్తులకు సమాచారం అందుతుందనేది స్పష్టం అవుతోంది. ఇసుక అక్రమ రవాణా చేసే వ్యక్తులు కొందరు తమ వాహనాలు ముందుగా ఉంచి అధికారులు లేని రూట్లలో ఈ వాహనాలు పంపేందుకు చర్యలు చేపడుతున్నారు. పట్టణ, మండల శివారుల్లో ముందుగానే తమ వాహనంతో రెడీగా ఉంటూ ఇసుక అక్రమంగా తరలించే వాహనాలకు సమాచారం అందించి ఇతర ప్రాంతాలకు పంపుతున్నట్లు సమాచారం. రెవెన్యూ అధికారులే కాకుండా, పోలీసులు, మైనింగ్ అధికారులు జాయింట్‌గా తనిఖీ నిర్వహించి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు
ఏర్గట: అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఏర్గట్ల ఎస్సై హరిప్రసాద్ హెచ్చరించారు. బట్టాపూర్‌లో పోలీసుల, రెవెన్యూ అధికారుల కండ్లు గప్పి రాత్రి సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు నిఘా వేసి బుధవారం ట్రాక్టర్‌ను పట్టుకుని కేసు నమోదు చేసి రెవెన్యూ ఆధికారులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...