హత్య కాదు ఆత్మహత్యే..!


Sun,October 13, 2019 01:16 AM

నిజామాబాద్‌ క్రైం/ఖలీల్‌వాడి: నిజామాబాద్‌ జిల్లాకేంద్ర ప్రభుత్వ దవాఖానలో ఐదు రోజులుగా ఇన్‌పేషెంట్‌గా చికిత్స పొందుతున్న వ్యక్తి కత్తిపోట్లతో దవాఖాన బెడ్‌పై మృతిచెంది ఉండడం పలు అనుమానాలకు తావిస్తుండగా.. సదరు రోగి తనకు తానే కత్తితో పొడుకుని ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ గ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాస్‌(38) అనే వ్యక్తి అనారోగ్యంతో ఈనెల 7న నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ దవాఖానలో చేరాడు. వైరల్‌ జ్వరం రావడంతో వైద్యుల సూచనల మేరకు కుటుంబీకులు అతన్ని దవాఖానలో చేర్పించారు. అతడితో పాటు భార్య అమృత దవాఖానలో వెంట ఉంది. ఈనెల 10న గురువారం రాత్రి సమయంలో వార్డులో బెడ్‌పై నిద్రిస్తున్న అతడు, శుక్రవారం ఉదయాన్నే చాతిలో కత్తితో పొడిచిన గాయాలతో రక్తం కారుతూ కనిపించాడు. గమనించిన అతని భార్య దవాఖాన సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది అతడిని చికిత్స నిమిత్తం మరో వార్డుకు షిప్ట్‌ చేశారు.అక్కడ చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌ శుక్రవారం మృతిచెందాడు.

తన భర్త శ్రీనివాస్‌ కొంత కాలంగా మానసిక స్థితి బాగాలేక ఇప్పటికి రెండు సార్లు ఆత్మహత్యకు యత్నించాడని నిజామాబాద్‌ ఒకటో టౌన్‌ పోలీసులకు ఆయన భార్య అమృత ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా నిజామాబాద్‌ వన్‌ టౌన్‌ ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. శ్రీనివాస్‌ వార్డులో తన పక్కన బెడ్‌పై ఉన్న వారి వద్ద నుంచి పండ్లు కోసేందుకు వినియోగించే కత్తి తీసుకొని, తనను తాను పొండుచుకున్నట్లుగా తమ విచారణలో తేలిందని ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు తెలిపారు. జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్న వ్యక్తి కత్తిపోట్లతో అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేగింది. రోగి అనుమానాస్పదంగా మృతిచెందడంపై జిల్లాకేంద్ర దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దీన్‌దయాళ్‌ బంగ్‌ స్పందించారు. రోగి శ్రీనివాస్‌ కత్తితో తనుకు తానే పొడుచుకున్నాడని, తీవ్రంగా గాయపడిని అతడిని బతికించేందుకు వైద్యులు ప్రయత్నించారని, తీవ్ర రక్తస్రావం కావడంతో ఫలితం లేకుండా పోయిందన్నారు. వ్యక్తిగత కారణాలతోనే తను ఆత్మహత్యకు యత్నించినట్లు వైద్యులతో అతడు తెలిపినట్లు సూపరింటెండెంట్‌ చెప్పారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...