వేర్వేరు కారణాలతో నలుగురు మృతి


Sun,October 13, 2019 01:16 AM

లింగంపేట(తాడ్వాయి): తాడ్వాయి మండల కేంద్రానికి సంజీవులు (20) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై కృష్ణమూర్తి తెలిపారు. సంజీవులు కొంత కాలంగా తీవ్ర కడుపునొప్పితో బాధ పడుతున్నట్లు తెలిపారు. కడుపునొప్పికి చికిత్సలు నిర్వహించినా తగ్గక పోవడంతో గత బుధవారం కలుపునివారణ మందు తాగి ఆత్మహత్య యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కామారెడ్డికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. ఆక్కడ చికిత్స పొందు తూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

చిన్నకోడప్‌గల్‌ సమీపంలో లారీ క్లీనర్‌...
పిట్లం: చిన్నకోడప్‌గల్‌ గ్రామ సమీపాన మూడు రోజుల క్రితం రెండు లారీలు ఢీ కొన్న ఘటనలో శనివారం నెపాల్‌కు చెందిన లారీ క్లీనర్‌ బహదూర్‌(35) మృతిచెందినట్లు ఏఎస్సై బన్సిలాల్‌ తెలిపారు. ఏఎస్సై తెలిపిన వివరాల మేరకు .. లారీ చెడిపోగా మూడు రోజులుగా మరమత్తులు చేస్తున్నారు. శనివారం క్లీనర్‌ బహదూర్‌ లారీలో మృతి చెందినట్లు ఏఎస్సై తెలిపారు. క్లీనర్‌ గుండెపోటుతో మృతిచెందినట్లు లారీ డ్రెవర్‌ నరేందర్‌సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడని, కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాన్సువాడ ఏరియా దవాఖానకు తరలించామని ఏఎస్సై పేర్కొన్నారు.

రెడ్డిపేట్‌లో పిడుగుపడి ...
విద్యానగర్‌(రామారెడ్డి) : రామారెడ్డి మండలం రెడ్డిపేట్‌ గ్రామానికి మగ్గం బాలరాజ్‌ 55 పిడుగుపాటుకు మృతి చెందినట్లు ఎస్సై రాజు పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం సాయంత్రం బాలరాజ్‌ తన పొలానికి వెళ్తుండగా ఒక్క సారిగా ఉరుములు మెరుపులతో వర్షం రాడంతో చెట్టు కిందకు వెళ్లాడు. పిడుగు పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని కామారెడ్డి ఏరియా దవాఖానకు తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

మాలోత్‌ సంగ్యా నాయక్‌ తండాలో..
లింగంపేట్‌ : మాలోత్‌ సంగ్యా నాయక్‌ తండాకు చెందిన కాట్రోత్‌ దేవుజా(47) పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తండా సర్పంచ్‌ బన్నీ సక్రు, ఏఎస్సై రాజేశ్వర్‌ తెలిపారు. వారు తెలిపిన వివరాలే మేరకు.. కాట్రోత్‌ దేవుజా బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడికి భార్య అంగూరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. పట్టాపాస్‌ పూస్‌ పుస్తకం రాకపోడంతోనే మనస్తాపం చెంది దేవుజాఆత్మహత్యకు పాల్పడినట్లు సర్పంచ్‌ తెలిపారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...