లాంగ్‌ రూట్లకు పెరిగిన బస్సుల సంఖ్య


Sun,October 13, 2019 01:16 AM

బాన్సువాడ, నమస్తే తెలంగాణ : బాన్సువా డ డివిజన్‌ కేంద్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ప్రయాణిలకుల పై సమ్మె ప్రభావం పడకుండా చర్యలు చేపడుతున్నది. సమ్మెలో భా గంగా ఎనిమిదో రోజైన శనివారం ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రూట్లలో బస్సు లు నడిపారు. ఉదయం 5 గంటల నుంచి బాన్సువాడ డిపో నుంచి హైదరాబాద్‌ లాంటి దూర ప్రాంతాలకు బస్సులు నడిపారు. రెండో శనివారం కావడంతో ఎక్కువ మొత్తంలో బస్సులను లాంగ్‌ రూట్లకు పంపామని, శుక్రవా రం పంపిన రూట్లలో రెండు బస్సులను తగ్గించామని, ప్రయాణికుల అవసరాల మేరకు ఆయా రూట్లలో బస్సులు పంపినట్లు ఆర్టీసీ డీఎం సాయన్న తెలిపారు.

లాంగ్‌ రూట్లకు పెరిగిన బస్సుల సంఖ్య..
బాన్సువాడ డివిజన్‌ కేంద్రం ఆర్టీసీ డిపో నుంచి హైదరాబాద్‌ లాంటి దూర ప్రాంతాలకు బస్సులను ఎక్కువ సంఖ్యలో పంపారు. బాన్సువాడ - హైదరాబాద్‌తో పాటు బాన్సువాడ- నిజామాబాద్‌, బాన్సువాడ- బోధన్‌, బాన్సువాడ- బిచ్కుంద, బాన్సువాడ-పిట్లం, బాన్సువాడ-కామారెడ్డి, బాన్సువాడ -బీర్కూర్‌, బాన్సువాడ -ఎల్లారెడ్డి, బాన్సువాడ-కామారెడ్డి- హైదరాబాద్‌ రూట్లతో పాటు అన్ని రూట్లలో బస్సులను నడిపారు. పండుగకు వచ్చిన వారి కోసం ప్రత్యేకంగా హైదరాబాద్‌కు ఎక్కువ సంఖ్యలో బస్సులు పంపినట్లు డీఎం సాయన్న తెలిపారు. ఆర్టీసీ బస్సులు 30, హైర్‌ బస్సులు 20, కాంట్రాక్టు క్యారియర్స్‌ 1, ఈఐబీ (ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూట్‌ బస్సులు) 4, మ్యాక్సి క్యాబ్స్‌ 16 మొత్తం 71 వాహనాలు నడిపినట్లు వివరించారు.

రెవెన్యూ సిబ్బందితో మానిటరింగ్‌
బాన్సువాడ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్లర్లకు ఆర్డీవో రాజేశ్వర్‌ ఆధ్వర్యంలో మానిటరింగ్‌ చర్యలు చేపడుతున్నారు. బాన్సువాడ డివిజన్‌లోని నిజాంసాగర్‌, బాన్సువాడ, తదితర మండలాలకు రెవెన్యూ శాఖ కంప్యూటర్‌ ఆపరేటర్లతో మానిటరింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. బస్సుల్లో తాత్కాలిక కండక్లర్లకు టికెట్‌ ఇచ్చే మిషన్‌ ఇవ్వడంతో పాటు వారికి అవగాహన కల్పించేందుకు బాన్సువాడ ఆర్టీసీ డిపోలో ముగ్గురు సిబ్బందిని నియమించారు. రెవెన్యూ సిబ్బందికి ఉదయం 5 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకు బస్సులు నడిపిన కండక్టర్ల వద్ద టికెట్లు ఇచ్చి మానిటరింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. వివిధ రూట్లతో తిరిగే బస్సుల్లో టికెట్‌ తనిఖీలు నిర్వహించేలా సిబ్బందిని పంపనున్నట్లు సమాచారం.

నిరుద్యోగుల క్యూ..
బాన్సువాడ ఆర్టీసీ డిపోలో తాత్కాలిక కండక్టర్లుగా విధులు నిర్వహించేందుకు యువకులు క్యూ కట్టారు. ఉదయం నుంచే డిపో వద్ద సుమారు 150 మంది క్యూ కట్టారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...