కొనసాగుతున్న గ్రామ కమిటీల ఎన్నికలు


Sat,August 24, 2019 12:41 AM

ఆర్మూర్ రూరల్ : మండలంలోని అంకాపూర్, సుర్భిర్యాల్ గ్రామాల్లో ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం టీఆర్‌ఎస్ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంకాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మంగ్లారం భూమేశ్, యువజన విభాగం అధ్యక్షుడిగా రాకేశ్ గౌడ్ తాళ్లపల్లి, రైతు కమిటీ అధ్యక్షుడిగా లక్కారం రాజశేఖర్, మహిళా అధ్యక్షరాలిగా పడకంటి జమున, సుర్భిర్యాల్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా వెల్మ సాయిరెడ్డి, ఉపాధ్యక్షులుగా అబ్బ రాజేశ్వర్, సట్ల గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా రమేశ్, రైతు విభాగం అధ్యక్షుడిగా కుమ్మరి సాయన్న, ఉపాధ్యక్షులుగా పేట సాయారెడ్డి, రాటం సాయన్న, ప్రధాన కార్యదర్శిగా వెల్మ పర్సారెడ్డి, యువజన సెల్ అధ్యక్షుడిగా గోపిడి సంకీర్త్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా జక్క అరుణ్ పట్టికొండ గణేశ్, ప్రధాన కార్యదర్శిగా పురుషోత్తం, మహిళా అధ్యక్షురాలి వెల్మల వసంతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పి.నర్సయ్య, టీఆర్‌ఎస్ గ్రామ కమిటీ ఇన్‌చార్జి ఇట్టడి లింబారెడ్డి, ప్రభుదాస్, దుమ్మ శ్రీను, ఉప సర్పంచ్ కిషోర్, ఎంపీటీసీలు గంగారెడ్డి, మహేందర్, సళ్ల నర్సారెడ్డి, అనిల్ గౌడ్, దేవేందర్, నర్సయ్య, సుర్భిర్యాల్ సర్పంచ్ సవిత, తెరాస నాయకులు, మోహన్‌రెడ్డి, లక్ష్మీనర్సయ్య, ముత్యం, సాయిరెడ్డి, మల్కాగౌడ్, వీపీ సాయారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కల్లెడిలో..
మాక్లూర్ : మండలంలోని కల్లెడి గ్రామంలో శుక్రవారం టీఆర్‌ఎస్ గ్రామ కమిటీలను ఆ పార్టీ ముఖ్య నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కల్లడి గ్రామ అధ్యక్షుడిగా సోంతే చిన్నరమేశ్, యూత్ అధ్యక్షుడిగా సుక్కి నవీన్‌తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుక్కిసుజాత, టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి బడుగు సత్యం, బాశెట్టి సుమలత సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...