పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి


Fri,August 23, 2019 04:14 AM

కోటగిరి : అక్రమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇండ్లు లేని నిరుపేదలకు స్థలాలు కేటాయించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కంజర భూమ య్య డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పేదలు ఆక్రమించుకొని నివాసం ఉంటున్న భూ ములను రెగ్యులర్ చేస్తామని చెప్పి 58,59 జీవోలు తీసుకొచ్చారని, ఇందులో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. కోటగిరి మండల కేంద్రంలోని బీసీ కాలనీ సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్ వద్ద సర్వే నంబరు 1302లో ఉన్న 250 గజాల ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైందన్నారు. ఉన్నతాధికారులు స్పందిం చి కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని పేదలకు ఇవ్వాలని కోరారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...