స్త్రీశక్తి భవనాన్ని నిర్మించాలని వినతి


Fri,August 23, 2019 04:13 AM

ఆర్మూర్, నమస్తే తెలంగాణ : మున్సిపల్ పరిధిలో స్త్రీశక్తి భవనాన్ని నిర్మించాలని గురువారం ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ఆదముల్ల శైలజకు పట్టణ మహిళా సమాఖ్య సభ్యులు వినతి పత్రం అందజేశారు. పట్టణాన్ని ప్రస్తుతం 36వార్డులుగా చేశారని ఈ వార్డుల్లో సుమారు 1000 మహిళా సంఘాలు ఉన్నాయని వివరించారు. వార్డు, పట్టణ స్థాయి సమావేశాలు నిర్వహించేందుకు భవనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఎల్‌ఎఫ్ అధ్యక్షురాలు నీలిమా, ఉపాధ్యక్షురాలు నజ్మ, కార్యదర్శి సుమలత, సహాయ కార్యదర్శి సావిత్రి, కోశాధికారి నాగరాణి తదితరులు ఉన్నారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...