అధికారిని బెదిరించిన ముగ్గురిపై కేసు


Thu,August 22, 2019 12:18 AM

నిజామాబాద్ క్రైం: జిల్లా కేంద్రంలోని వర్ని ఎక్స్‌రోడ్డు వద్ద రోడ్డు పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో హద్దుపాతిన వారిని మున్సిపల్ ప్లానింగ్ అధికారి ప్రశ్నించగా.. ఆయనకు ఎదు రు తిరిగారు. దీంతో ఎంపీవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సంబంధిత రెండో టౌన్ ఎస్సై ఎ.ఆంజనేయులు తెలిపారు. ఆయన తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 19వ తేదీ సోమవారం నగరంలోని వర్ని ఎక్స్‌రోడ్డు వద్ద ఉన్న ఓ ప్రభుత్వ స్థలంలో పలువురు వ్యక్తులు అది తమకు చెందిన స్థలంగా చెబుతూ అక్కడ హద్దులు పాతుతున్నారు.

విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ సిటీ ఫ్లానర్ (ఏసీపీ) అధికారి పి.శ్యాం కుమార్, సిబ్బంది కలిసి సంఘటన స్థలానికి వెళ్లారు. అక్క డ హద్దులు పాతిన వారిని ఆయన ప్రశ్నించగా.. ఎదురు తిరిగారు. దీంతో సదరు మున్సిపల్ అధికారి ఈ విషయంపై సం బంధిత రెండోటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ స్థలంలో హద్దులు పాతడానికి యత్నించిన జావిద్, శ్రీనివాస్ గౌడ్‌తో పాటు ట్రాక్టర్ యజమాని సాయిబాబపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...