వృద్ధులకూ చట్టాలు ఉన్నాయ్..


Thu,August 22, 2019 12:18 AM

నిజామాబాద్ లీగల్ : వయో వృద్ధులకు రక్షణ చట్టాలు ఉన్నాయని, వాటిని వినియోగించుకొని తగిన రక్షణ పొందాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ మహి అన్నారు. ఆరోగ్య సంరక్షణతో పాటు అన్ని రకాల సేవలు కలిగి ఉన్నారని, వాటిని తెలుసుకొని లబ్ధి పొందాలని ఆమె సూచించారు. నిజామాబాద్ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగ సంఘ భవనంలో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని వయోవృద్ధుల చట్టాలను వివరించారు. వృద్ధాప్యంలో ఆర్థిక పరమైన సమస్యలు ఉంటే వారి సంతానం నుంచి పోషణ ఖర్చులు కోరడానికి రెవెన్యూ డివిజనల్ అధికారిని సంప్రదించాలని సూచించారు. వయోవృద్ధులకు తోడు, నీడగా చట్టం నిలుస్తుందని, చట్ట ఫలాలు అందజేయడానికి న్యాయ సేవా అధికార సంస్థ అండగా ఉంటుందని అభయమిచ్చారు.

గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించడానికి పౌరులకున్న హక్కులను వివరించారు. నేటి సమాజంలో ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు కరువు అవుతున్నాయని, వాటిని పునరుద్ధరించడానికి పౌర సమాజం సహకరించాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి రవీందర్ మాట్లాడుతూ.. చట్టం ఉపయోగాలు, ప్రయోజనాలను న్యాయ సేవా సంస్థ వివరించిన తీరు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు రాజ్‌కుమార్ సుబేదార్, మాణిక్‌రాజ్, సంఘ సభ్యులు రాజారాం, భూమాగౌడ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...