ప్రైవేటు దవాఖానల్లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభం


Thu,August 22, 2019 12:18 AM

నిజామబాద్ సిటీ : రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ వైద్యశాలలు సమ్మెను విరమించాయి. బకాయిల విడుదలకు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నట్లు వైద్యశాలల అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం ప్రకటించారు. మంగళవారం రాత్రి సచివాలయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో ప్రైవేటు దవాఖానల యజమానులు మరోసారి చర్చలు జరిపారు. నిధుల విడుదలకు మంత్రి హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నామని వారు తెలిపారు. దీంతో బుధవారం నుం చి ప్రైవేటు దవాఖానల్లో ఆరోగ్య సేవలు ప్రారంభమయ్యాయి.

ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ప్రైవేటు దవాఖానల యజమానులు కొద్ది రోజులుగా చేపట్టిన సమ్మెను విరమించడంతో బుధవారం నుంచి జిల్లా వ్యాప్తంగా 17 ప్రైవేటు దవాఖానల్లో ఆరోగ్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల 16వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలను ప్రైవేటు దవాఖానల్లో నిలిపివేశారు. బిల్లులు భారీగా పెరిగి పోవడంతో సంవత్సరం నుంచి చెల్లింపులు చేయక ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ప్రైవేటు దవాఖానల యజమానులు సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దవాఖానల్లో చికిత్స పొందుతున్న వారికి మాత్రం యధావిధిగా సేవలను అందించారు.

ప్రైవేటు వైద్యశాలల్లో సేవలు నిలిపివేయడంతో ప్రభుత్వ దవాఖానల్లో సేవలను అందించారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర దవాఖానతో పాటు బోధన్, ఆర్మూర్ వైద్యశాలల్లో ఆరోగ్యశ్రీ సేవలను అందించారు. నాలుగు రోజులు ప్రభుత్వ దవాఖానల్లో వందల మంది ఓపీ చూయించుకోగా, 50 మంది వరకు అడ్మిట్ అయ్యారు. ఈ సంవత్సరం జనవరి నుంచి ఆగస్టు 16వ తేదీ వరకు సుమారు 15వేల మంది రోగులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు అందాయి.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...