భవిష్యత్ తరాల కోసమే హరితహారం


Thu,August 22, 2019 12:17 AM

ఆర్మూర్, నమస్తే తెలంగాణ : హరితహారం పథకంలో నాటిన మొక్కలను ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పెంచాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ఆదముల్ల శైలజ అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ఆర్మూర్ కాశీ హనుమాన్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బుధవారం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భావితరాల భవిష్యత్ కోసమే ఈ పథకం చేపట్టిందన్నారు. కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొట్టాల మోహన్, టీఆర్‌ఎస్ నాయకుడు జాగిర్దార్ శ్రీనివాస్, సంఘం కోశాధికారి కలిగోట్ లక్ష్మీనారాయణ, కార్యదర్శి కునింటి నిలేశ్, సహాయ కార్యదర్శి దోమకొండ ప్రకాశ్, నాయకులు సంతోష్, హన్మంతు తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...