ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు


Thu,August 22, 2019 12:17 AM

ఆర్మూర్, నమస్తే తెలంగాణ : ఆర్మూర్ మున్సిపల్ విలీన గ్రామాలకు మంజూరైన అభివృద్ధి పనులకు ప్రతిపాదనలను బుధవారం మున్సిపల్ అధికారులు సిద్ధం చేశారు. విలీన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంతో మంగళవారం రూ.20 కోట్ల నిధులను మంజూరు చేయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం మున్సిపల్ కమిషనర్ శైలజ, ఏఈ దీప్‌చంద్ పెర్కిట్, కోటార్మూర్, మామిడిపల్లి గ్రామాల్లో అభివృద్ధి నిధులతో చేపట్టబోయే పనుల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సిద్ధం చేసిన ప్రతిపాదనలను ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టర్ ఆనుమతుల కోసం పంపనున్నట్లు కమిషనర్ శైలజ తెలిపారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...