పెంపకందారులకు పశువుల దాణా పంపిణీ


Thu,August 22, 2019 12:16 AM

ఆర్మూర్ రూరల్ / మాక్లూర్ : మండలంలోని ఆలూర్ గ్రామంలో బుధవారం జీవాల పెంపకందారులకు సర్పంచ్ కళ్లెం మోహన్ రెడ్డి రెండో విడత దాణా బస్తాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గొల్ల, కుర్మల అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్, టీఆర్‌ఎస్ నాయకులు చిన్నారెడ్డి, మల్లేశ్, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు మూలకిడి శ్రీనివాస్ రెడ్డి, ఆలూర్ సొసైటీ చైర్మన్ నల్మెల మోహన్ రెడ్డి, ఆలూర్ పశువైద్యశాల ఇన్‌చార్జి డాక్టర్ శైలజ, గొర్రెల మేకల పెంపకందారుల సంఘ మండల అధ్యక్షుడు తోట భాజన్న రైతులు పాల్గొన్నారు.

మాక్లూర్ మండలంలోని గొట్టుముక్కల గ్రామంలో 51 మంది గొర్రెల పెంపకందారులకు ఉచితంగా గొర్రెల దాణాను పంపిణీ చేసినట్లు మండల పశువైద్యాధికారి కిరణ్‌దేశ్‌పాండే తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ దారం ప్రవీణ్, ఎంపీటీసీ బేగరి సత్తెమ్మ, బేగరి రవి, జేవీవో పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...