టీఆర్‌ఎస్ గ్రామకమిటీల ఏకగ్రీవ ఎన్నిక


Wed,August 21, 2019 11:45 PM

ఆర్మూర్ రూరల్ / మాక్లూర్ / నందిపేట్ / నందిపేట్ రూరల్ : నూతనంగా ఎన్నికైన టీఆర్‌ఎస్ గ్రామకమిటీ సభ్యులు పార్టీ పటిష్టతకు కృషి చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో బుధవారం టీఆర్‌ఎస్ గ్రామకమిటీలను ఎన్నుకున్నారు. అనంతరం నూతన కమిటీ కార్యవర్గాలకు నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని కాపాడాలని, నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని సూచించారు. మచ్చర్ల గ్రామశాఖ అధ్యక్షుడిగా దావిద్, అనుబంధ సంఘాల అధ్యక్షులుగా భోజన్న, దివ్య, సిరంపురం గంగారెడ్డి, దేగాం గ్రామశాఖ అధ్యక్షుడిగా మేకల రాజేశ్వర్, అనుబంధ సం ఘాల అధ్యక్షులుగా మహిపాల్‌రెడ్డి, రాణి, ముత్యంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్, వైస్ ఎంపీపీ మోతె భోజకళ చిన్నారెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఇట్టెడి లింగారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

మాక్లూర్ మండలం ముల్లంగి(బి) గ్రామ టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా షేక్ చిన్న హిమామ్, యూత్ అధ్యక్షుడిగా సురేశ్, మహిళా అధ్యక్షురాలిగా పుష్ప, రైతు అధ్యక్షుడిగా లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శిగా మైమూద్, అడవి మామిడిపల్లి అధ్యక్షుడిగా గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా డీసీ గంగాధర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ మాస్త ప్రభాకర్, టీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బడుగు సత్యం, సీనియర్ నాయకులు బూరోల్ల అశోక్, శ్యాం రావు, మైబూబ్, భూం రావు, ఆశన్న, రమణా రావు, జిట్ట గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

నందిపేట్ మండలం చౌడమ్మకొండూర్ గ్రామశాఖ అధ్యక్షుడిగా భూమేశ్‌ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నక్కల భూమేశ్, వైస్ ఎంపీపీ దేవేందర్, సర్పంచ్ ప్రభాకర్, నాయకులు భూమేశ్వర్, ఇలియాస్, నూత్‌పల్లి సర్పంచ్ కూనింటి రవి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెల్మల్ టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా తల్వేద రాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సర్పంచ్ మచ్చర్ల పెద్ద గంగారాం, నాయకులు వెల్మల్ రాజన్న, కేజీ సురేశ్, బీఆర్ గంగాధర్, పోలాస ముత్యం, దారం సురేశ్, ఎండీ రఫీ, ఉమ్మెడ సర్పంచ్ రాముడ పోశెట్టి, మచ్చర్ల సాగర్ తదితరులు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...