వర్షాలు కురవాలంటే మొక్కలు నాటాలి


Wed,August 21, 2019 03:25 AM

బీర్కూర్ : వర్షాలు విరివిగా కురవాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని టీఆర్‌ఎస్ బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి పోచారం సురేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని రైతునగర్ గ్రామంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రభుత్వం నుంచి ఇచ్చే 40 వేల మొక్కలు నాటడంతో పాటు సర్పంచ్, సర్పంచుల సమాఖ్య మండల అధ్యక్షుడు మద్దినేని నాగేశ్వర్‌రావు తన సొంత ఖర్చుతో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కడెం మండలం నుంచి సుమారు 80 వేల రూపాయలతో అన్ని రకాల పూలు, పండ్ల మొక్కలను గ్రామస్తులకు అందించి వాటిని సురేందర్‌రెడ్డి చేతుల మీదుగా నాటించారు. బీర్కూర్ గ్రామానికి చెందిన నలుగురు లబ్ధిదారులకు సరేందర్‌రెడ్డి షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సహాయ సహకారాలతో రైతునగర్ గ్రామంతో పాటు బాన్సువాడ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు. రైతునగర్ సర్పంచ్ నాగేశ్వర్‌రావు మాదిరిగా మొక్కలు నాటే కార్యక్రమాలను అందరూ చేపట్టాలన్నారు. రాష్ట్రంలో బాన్సువాడ నియోజకవర్గంలోనే అత్యధికంగా డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, రైతునగర్, దామరంచ, వీరాపూర్, అన్నారం గ్రామాల్లో ఇండ్లు మంజూరు చేయించి పేదలకు న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ తిలకేశ్వరి రఘు, వైస్ ఎంపీపీ కన్నెగారి కాశీరాం, మాజీ జడ్పీటీసీ సభ్యుడు ద్రోణవల్లి సతీశ్, మండల కోఆప్షన్ సభ్యుడు ఆరీఫ్, ఆర్‌ఎస్‌ఎస్ మండలాధ్యక్షుడు ద్రోణవల్లి అశోక్, తహసీల్దార్ బాలశంకర్, ఎంపీడీవో భరత్‌కుమార్, ఏవో కమల, ఎస్సై పూర్ణేశ్వర్, సొసైటీ చైర్మన్లు అప్పారావు, బుద్దె సుభేశ్, టీఆర్‌ఎస్ మండల కన్వీనర్ లాడేగాం వీరేశం, గ్రామ అధ్యక్షుడు రామకృష్ణ, ఉపసర్పంచ్ ఘంటా సిద్ధార్థ, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...