డాక్టరేట్ అందజేత


Wed,August 21, 2019 03:25 AM

డిచ్‌పల్లి, నమస్తేతెలంగాణ: తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయన శాఖలో పీహెచ్‌డీ పరిశోధకురాలు కటుకోజ్వల పణీశకు మంగళవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సమావేశ మందిరంలో పీహెచ్‌డీ వైవా పరీక్ష నిర్వహించి డాక్టరేట్ ప్రదానం చేశారు. తెలుగు అధ్యయన శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి పర్యవేక్షణలో పరిశోధకురాలు పణీశ మెదక్ జిల్లా సాహిత్య చైతన్యం - సమగ్ర విశ్లేషణ అనే అంశంపై పరిశోధన చేశారు. ఈ పరిశోధనకు సంబంధించిన వైవాకు మద్రాసు విశ్వవిద్యాలయానికి చెందిన తెలుగు విభాగాధిపతి ఆచార్య మాడభూషి సంతప్ కుమార్ హాజరై పరిశోధకురాలిని వివిధ ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. చైర్మన్, ఆర్ట్స్ డీన్ ఆచార్య పి.కనకయ్య, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఘంటా చంద్రశేఖర్, తెలుగు అధ్యయన శాఖ అధ్యాపకులు డాక్టర్ వి.త్రివేణి, డాక్టర్ కె.లావణ్య, డాక్టర్ సీహెచ్ లక్ష్మణచక్రవర్తి, హిందీ విభాగం అధ్యాపకులు డాక్టర్ ప్రవీణాబాయి, డాక్టర్ జమీల్, ఉర్దూ విభాగం అధ్యాపకులు డాక్టర్ గుల్‌ఈరాణా, డాక్టర్ అబ్దుల్ ఖవి, మాస్ కమ్యూనికేషన్ విభాగాధిపతి డాక్టర్ ప్రభంజన్ యాదవ్, ఎకనామిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...