అసోసియేట్ ఎన్‌సీసీ ఆఫీసర్ల నియామకం


Wed,August 21, 2019 03:25 AM

డిచ్‌పల్లి, నమస్తేతెలంగాణ: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలకు చెందిన ఎన్‌సీసీ అభ్యర్థులకు అసోసియేట్ ఎన్‌సీసీ ఆఫీసర్స్ నియామక ప్రక్రియ మంగళవారం నిజామాబాద్‌లోని ఎన్‌సీసీ గ్రూప్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించారు. 12వ తెలంగాణ బెటాలియన్‌కు చెందిన కమాండెంట్ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో అసోసియేట్ ఎన్‌సీసీ ఆఫీసర్స్ ప్రక్రియకు తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య డి.బలరాములు హాజరయ్యారు. టీఆర్‌జీ ఆఫీసర్స్ కల్నల్ రాజేందర్‌సింగ్ నుంచి వచ్చిన ఎంపిక ఉత్తర్వుల మేరకు రిజిస్ట్రార్ హాజరయ్యారు. దాదాపు 60 మంది అభ్యర్థులు ఈ ఎంపిక ప్రక్రియలో హాజరు కాగా విద్యాపరమైన ధ్రువీకరణ పత్రాలను, దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. క్రమశిక్షణా సంబంధిత విషయాలను, జాతి, సమైక్యత, సమగ్రతకు సంబంధించిన సామాజిక అంశాలను ఇంటర్వ్యూలో అడిగి సమాధానాలు తెలుసుకున్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...