ఆటోల తనిఖీ.. 23 కేసులు నమోదు


Wed,August 21, 2019 03:25 AM

నిజామాబాద్ సిటీ: డీటీసీ సీహెచ్ శివలింగయ్య ఆదేశాల మేరకు ఆర్టీఏ అధికారులు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఆటోల తనిఖీలు నిర్వహించారు. నిజామాబాద్ నగరం, బోధన్, మోర్తాడ్, బోర్గంలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్తున్న ఆటోలను తనిఖీ చేసి 23 కేసులు నమోదు చేశారు. పరిమితకి మించి ఆటోల్లో ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రయాణికులు జాగ్రత్తలు వహించాలని అధికారులు అవగాహన కల్పించారు. డ్రైవింగ్ లైస్సెన్స్,ఫిట్‌నెస్ లేని ఆటోలపై కేసులు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆటో డ్రైవర్లు ప్రయాణికులను ఎక్కించుకొని తీసుకెళ్తే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారి డీవీ రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు జీఆర్ రాజు, బీఆర్‌కే సత్యమూర్తి, ఎస్.జయప్రకాశ్‌రెడ్డి, కార్తీక్, హితేశ్‌చౌదరి పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...