నవోదయ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం


Wed,August 21, 2019 03:24 AM

బీర్కూర్ : జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి నాగేశ్వర్‌రావు తెలిపారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు నవోదయకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ఆయన తెలియజేశారు. సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారని ఆయన తెలియజేశారు. జనవరి 11 తేదీన నవోదయ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారని ఆయన తెలియజేశారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...