వృద్ధుడిని కాపాడిన హోంగార్డు


Tue,August 20, 2019 01:43 AM

నందిపేట్ : నందిపేట్ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న నర్సయ్య ఓ వృద్ధుడి ప్రాణాలు కాపాడాడు. ఆత్మహత్యాయత్నం చేస్తుండగా అడ్డుకున్నాడు. నర్సయ్య ఆదివారం రాత్రి తన సొంత గ్రామం నాళేశ్వర్ నుంచి భైంసా మండలం బేల్‌తరోడా గ్రామంలోని తన అన్న ఇంటికి బైక్‌పై వెళ్తున్నాడు. బాసర గోదావరి వంతెనపై వెళ్తుండగా.. అదే సమయంలో దన్గరి దేవన్న అనే వృద్ధుడు వంతెనకు ఇరుపక్కలా ఉండే గద్దె పైకి ఎక్కి నదిలోకి దూకబోయాడు. ఈ సమయంలో గమనించిన నర్సయ్య అతనిని అడ్డుకొని కిందికి దింపి, రోడ్డు గుండా వెళ్తున్న మరో వ్యక్తి సహాయంతో సముదాయించారు.

వృద్ధుడితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిజామాబాద్ మండలం బోర్గాం గ్రామానికి చెందిన ఆ వృద్ధుడి కుటుంబీలకు సమాచారం ఇచ్చారు. ఆయన కొడుకు నారాయణతో పాటు కుటుంబీకులు బాసరకు వచ్చే వరకు అక్కడే ఉండి వారికి అప్పగించాడు. ఆత్మహత్య చేసుకోబోతుండగా అడ్డుకొని ప్రాణాలు కాపాడినందుకు గాను కుటుంబీకులు నర్సయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...