సైన్స్‌ఫేర్‌లో ఎస్సెస్సార్ డిస్కవరీ విద్యార్థుల నమూనా పరిశీలన


Tue,August 20, 2019 01:43 AM

నిజామాబాద్ రూరల్ : హైదరాబాద్‌లోని తార్నాకాలో ఉన్న సీఎస్‌ఐఆర్ ఆడిటోరియంలో ఈనెల 17న నిర్వహించిన సైన్స్ ఫేర్‌లో నగరంలోని ఎస్సెస్సార్ డిస్కవరీ స్కూల్‌కు చెందిన పదో తరగతి విద్యార్థులు సానియా, తన్విరెడ్డి పాల్గొన్నారు. ది రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ(లండన్), ఇండియన్ దక్కన్ లో కల్ సెక్షన్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ రీ సెర్చ్ ఫౌండేషన్, వైట్‌బోర్డ్ వెంచర్స్ సంయుక్తంగా నిర్వ హించిన సైన్స్‌ఫేర్‌లో మోడ్రన్ పీరియాడిక్ టేబుల్‌పై ప్రాజెక్టు ను ప్రదర్శించారు.

సానియా, తన్విరెడ్డి రూపొందించిన నమూ నాపై అభినందనలు వెల్లువెత్తాయి. వీరి ప్రదర్శనను తిలకిం చిన ఐఐసీటీ డైరెక్టర్ శైలజ, వైట్‌బోర్డ్ అసోసియేట్ డైరెక్టర్ లక్ష్మి విద్యార్థులను అభినందించారని స్కూల్ కరస్పాండెంట్ హరిత గౌడ్, ప్రిన్సిపాల్ భాస్కర్ తెలిపారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...