సేఫ్టీ అండ్ సెక్యూరిటీ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం


Tue,August 20, 2019 01:42 AM

ఆర్మూర్, నమస్తే తెలంగాణ : ఆర్మూర్‌లోని పెర్కిట్ దుర్గ్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ హైదరాబాద్ సహకారంతో ఆరు రోజుల పాటు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రాంగణం జిల్లా అధికారిణి జ్యోతి సోమవారం తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో కిశోర బాలికలకు ఆరోగ్యం, పోషకాహారం, రక్తహీనత, తమను తాము ఏవిధంగా రక్షించుకోవాలో వివరించబడుతుందని పేర్కొన్నారు. ఎస్టీ, ఎస్టీకి చెందిన పెళ్లికాని మహిళా అభ్యర్థినులు ఈ శిక్షణ పొందవచ్చని తెలిపారు. 13 నుంచి 21 ఏండ్ల మధ్య వయస్సు కలిగిన వారికి ఈ శిక్షణనిస్తామని, 50 మంది అభ్యర్థినులకే అవకాశమున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ఆధార్ కార్డు, కులం, వయస్సుల ధ్రువీకరణ పత్రాలతో పాటు, 4 పాస్‌పోర్టు సైజు ఫొటోలతో ప్రాంగణంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాల కోసం 7660022520 నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...