ఆకతాయిలపై చర్యలు తప్పవు


Tue,August 20, 2019 01:42 AM

ఆర్మూర్, నమస్తే తెలంగాణ : అమ్మాయిలను వేధించే ఆకతాయిలపై చట్టరీత్యా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్మూర్ ఎస్సైలు విజయ్‌నారాయణ్, యాదగిరిగౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని విజయ్ డిగ్రీ కళాశాలలో సోమవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళల భద్రత, రక్షణ, ఈవ్‌టీజింగ్‌లపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా షీటీమ్ ఎస్సై ఐకే రెడ్డి మాట్లాడుతూ సమాజంలోని మహిళలకు రక్షణ కల్పించడం, ఆకతాయిల వేధింపులను అరికట్టడం షీటీమ్ యొక్క ప్రధాన ఉద్దేశమన్నారు. ఎస్సైలు విజయ్‌నారాయణ్, యాదగిరిగౌడ్ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారుల పేర్లను రహస్యంగా ఉంచి, మహిళలను వేధించిన వారిపై కేసు నమోదు చేస్తామన్నారు. అనంతరం షీటీమ్ ప్రతినిధులు స్రవంతి, సుమతి విద్యార్థినుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో విజయ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ భాస్కర్‌రెడ్డి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...